Sunday, February 27, 2011

చిన్నారి నిదురపోదే

సూర్యుడు అలసిపోయి అస్తమించె
   చిన్నారికి ఆటలందు అలుపైనా రాదే
గొవులన్నీ ఇల్లవైపు తరలి వెళ్ళె
    చిరునవ్వుల చిట్టిపాప అమ్మ కొరకు చూడదే
మబ్బుల చాటునుండి చందమామ తొంగిచూసె
     పాల బుగ్గల పసిపాప అల్లరైనా మానదే
కొలనునున్న కలువకన్నె సొమ్మసిల్లి వడిలిపోయె
     వడిలోన లాలించినా చిట్టితల్లి నిదురపోదే.....

కృషి

చేతి గీతలు దిద్దలేవు జీవితాలను
నుదుటి రాతలు మార్చలేవు బ్రతుకులను
కృషిని నమ్మి ముందుకు సాగు
అభిమానమే నీ ధనం, సహనమే ఆయుధం
ఆత్మవిస్వాసం తోడుగా పూల బాటను నిర్మించు
కీర్తి కిరీటాలను  అధిరోహించు 

Saturday, February 26, 2011

నీవులేక

నా ఊహల చిత్రానికి రంగులు అద్దావు
      జీవితం లోని వర్ణాల వన్నెలను ఆశ్వాదించాను
నా ఆశల నావకు చుక్కాని చూపావు
     జీవన గమ్యం చేరటానికి ఆలంబన అని తలచాను
అస్తమించే సుర్యుని లో దాగి ఉన్న అందాలను చూపావు
     బాధలెన్ని ఉన్నా చిరునవ్వులు చిందించటం అలవర్చుకున్నాను
నిశ్శబ్దం నుండి సంగీతాన్ని పలికించావు
    నీవు లేని ఏకాంతాన్ని భరించడం నేర్చుకున్నాను

నీవు నేను

జీవితమనే సాగరంలో,
ఓడవి నీవైతే,నిన్ను పయనింపచేసే తెరచాపని నేనవుత
తీరం నీవైతే,నిను నిలువెల్లా తడిమే కెరటం నేనవుత
పారే నీరు నీవైతే,నీలో సంగమమైన లవణం నేనవుత
ఎగిసిపడే అగ్నిపర్వతం నీవైతే,నిన్ను చల్లార్చే ౠతుపవనం నేనవుత
అస్తమించే సుర్యుడివి నీవైతే, నిన్ను గుండెలోతుల్లో దాచుకునే సముద్రాన్ని నేనవుత
అందుకే,
నీవు లేని నా జీవితం తలువనే లేను

నీవు చాలు

ఆకర్షించే రూపమెందుకు అణువైన గుణం చాలు,
మధురమైన మాటలెందుకు మృదువైన భావం చాలు,
కోట్లను మించిన ఆస్తులెందుకు ప్రేమించె హృదయం చాలు,
విలువైన కానుకలలెందుకు ఆరాధించె మనస్సు చాలు,
ఆకాశ వీధిలో విహారమెందుకు కలకాలం నా నీడ నీవై ఉంటె చాలు.

నీవెవరో

నీలి నింగిలోని చందమామవా
నీ చిరునవ్వులే చల్లని వెన్నెలాయె
జామ చెట్టు కొమ్మమీది రామచిలుకవా
నీ మధురమైన పలుకులు నా హృదయ తీగలను మీటె
ఆలజడికి నివాసమైన సముద్రానివా
నీ తీయటి తలపులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసె
నాలో దాగి ఉన్న శెతకోటి ఆశల రూపానివా
నీ సానిధ్యం కోటి వీణల సంగీతమాయె

వీడుకోలు...

రెక్కలు కదిలి ఆకశాన హరివిల్లులా ఎగిరే పక్షులమై సాగిపోదామిక
ఏ తీరానికి పయనమొ,ఏ చోటనో మరొ మజిలి
నేస్తాన్ని వీడలేక,స్నేహాన్ని మరువలేక,
కన్నీరు నిండిన కన్నులతో,బరువెక్కిన హ్రుదయాలతో
కలిసి తిరిగిన ప్రదేశాలను ఒక్కసారి తిరిగి చూసుకుంటూ
ప్రేమలు,ఆప్యాయతలు,బాధలు,ఆవేశాలు ఎన్ని రుచి చుశామొ ఈ నాలుగేల్లలొ...
అన్నింటిని పదిలపరుచుకోండి మీ ఎదలో
వెల్లిపోతున్నాం కానీ మనం వీడిపొవుటలేదుకదా
నేస్తమా ఇక సెలవా మరి...!

నా కిష్టం

నదీ పాయల హోరు మధ్యన ఇసుక తిన్నెల స్పర్స నా కిష్టం
చల్లని సాయంతాన్ని,తెల్లని వెన్నెలని సన్నజాజి పందిరి కింద కూర్చుని చూడడం నా కిష్టం
అమ్మ మెత్తని ఒడిలో పడుకుని కబుర్లాడడం నా కిష్టం
గున్నమామి కొమ్మమీది కోయిల పాటంటే నా కిష్టం
ముంగురులు నొసటి సిందూరాన్ని ముద్దాడుతుంటే చూడటం నా కిష్టం
కొబ్బారాకుల మధ్యన దోబూచులాడే చంద్రున్ని చూడటం నా కిష్టం
చేను గట్ల మీద తెగిన చెప్పులతో బురదలో నడవటం నా కిష్టం
గుడిలో రాలిన రాధ-మాధవ పూలంటె నా కిష్టం
జామ చెట్టు కొమ్మమీది రామ చిలుక కిలకిలలు నా కిష్టం
కాటుక రేఖులతో కలకల లాడె కనులంటె నా కిష్టం
ఎర్రగ పండిన గోరింట చేయంటె నా కిష్టం
తామరాకు మీది నీటి బొట్టు నా కిష్టం
ఇన్ని ఆనందాల్ని ఆశ్వదింపచేసె మనిషి జన్మంటె నా కెంతో కిష్టం