Tuesday, March 15, 2011

నాడు - నేడు

స్వరాజ్య కాంక్షలతో నిద్రలు మానారు, ఆకలి మరిచారు
సత్యాగ్రహాలే ఊపిరై బ్రతికారు, ఉద్యమాలు చేసారు
అహింసావాదమే ఆయుధమని నమ్మారు, యుద్ధాలు చేసారు
తమ జీవితాలను కర్పూరంలా మలిచారు, ఆవిరైపోయారు
కలనైన కనిపించని స్వతంత్రాన్ని తెచ్చారు, ఆనందాన్ని నింపారు
జోహార్లు మీకు నాటి నేతల్లరా, చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపారు

పచ్చనోట్ల కాంక్షలతో మంచిని మరిచారు, హింసను పెంచారు
దౌర్జన్యాలకి సలాములు కొడతారు, పూజలు చేస్తారు
అంతస్తులపై అంతస్తుల మేడలు కదతారు, డబ్బులతో నింపుతారు
ఎదురు తిరిగిన వాడి ప్రాణాలు తీస్తారు, ఇంటి దీపాలు ఆర్పుతారు
మన జీవితాలను కొవ్వొత్తులుగా చేస్తారు, దాని వెలుగులో బ్రతుకుతారు
భరతమాతను వీరు అమ్మనైనా అమ్ముతారు, దేనికీ వెనుకాడరు

వెనుదిరిగి చదువుకోండి శిలాశాసనాలపై చెక్కబడిన నాటి నేతల జీవితగాధలను
కొంతవరకైనా అవి మిమ్ము మార్చునేమో

విజయం

వర్షించే మేఘానివై నీరుగారకు
పైకెగిరే పక్షివి నీవై శ్రమపడు
వచ్చే ఫలితం కోసం నిరీక్షించకు
నీ కృషిని నమ్మి నీవు వెనుతిరగకు
కలిసొచ్చేది కాలమని ఆరాటపడు
ఈ జీవన పయనంలో విజయం నీదని నమ్మి చూడు

Wednesday, March 2, 2011

వనకన్య వేకువ

చిట్టి చిట్టి పక్షులెన్నో రాగాలు పాడి
చల్లని హిమ బిందువులు నీ మోమును తాకి
ఉదయించే సూర్యుడు లేలేత కిరణాలు విస్తరించి
ప్రకృతి వడిలో ఆదమరిచి నిదురించే నిన్ను మేల్కొల్పగా....

అందమైన ఆ అవనిని చూసి
అదుపులేని ఆనందం వేసి
నింగిని తాకే చిరుపక్షివి నీవై
ఉల్లాసంగా ఎగిసి పడుతుంటె

స్వర్గమంటి ఆ వనము మధ్యన
చుక్కలనంటు జలపాతాలతో
సరిగమలు మరిపించు కొయిల గానాలతో
జగత్తునే మరచి నీవు విహరిస్తుంటే

నేలనంటు ఆ నింగుకి దిగువ
ముత్యమంటి చిరు తొలకరి నడుమ
కలువలన్నీ నీ కరముల మధ్యన
అందంగా నీవు అగుపడుతుంటావు

అంతటి ప్రకృతి సోయగాన్ని సైతం మైమరపించే నీ అందం వర్ణనాతీతం

Tuesday, March 1, 2011

నేనంటేనే నీవు

రవికిరణాల వెలుగువి నీవు
చిరునవ్వుల రూపం నీవు
సిరిమువ్వల సవ్వడి నీవు
చిరుగాలుల పాటవి నీవు
విరజాజుల పరిమళం నీవు
నా పాటకు పల్లవి నీవు
నా గుండెకు చప్పుడు నీవు
నా మాటల మధురిమ నీవు
నా కనులకు వెలుగువి నీవు
నాలోని అణువణువు నీవు, నేనంటేనే నీవు  

నీవు

నా కనుల వెనుక స్వప్నం నీవు
నా మాటల వెనుక భావం నీవు
నా శ్వాస వెనుక స్పందన నీవు
నా విజయం వెనుక శ్రమవి నీవు
నా బాధల వెనుక కన్నీటివి నీవు
నా గమ్యం వెనుక పయనం నీవు
నా రేపటి వెనుక నిన్నవి నీవు
ఇలా,
   నేనుగా కనిపించే ప్రతి విషయంలో కనిపించని తోడువి నీవు
                                                               -- Collected