Thursday, November 28, 2024

నీ స్నేహం

 ఆశ అంచుల్ని తాకును నీ స్నేహం

పెదవి పలుకులకు తేనె నీ స్నేహం

మదిలోని ఆలాపనకు ఊరట నీ స్నేహం 

ఎదలోని ఆలోచనలకు చిరుజల్లు నీ స్నేహం

చిరకాలం గుండెలోతుల్లో మిగిలే బంధం నీ స్నేహం

Monday, July 6, 2020

Love is in the air

Love the heart that hurts you but don’t hurt the heart that loves you

New beginnings

Best way to get anything started is to begin doing

Dangerously beautiful

Every rose has a thorn. You need to decide which thorn you want to bleed for.

Music of silence

The sound of silence can sometimes be music to ones ears

Freedom

You are prisoner of your own thoughts. Cut the chains and set yourself free

Made for each other


People are not “MADE FOR EACH OTHER”. They are “MADE BY EACH OTHER”.

Serenity

Serenity is not freedom from the storm but pease amid the storm

Blissful countryside

Everything in the world is beautiful in its own way, just need a right eye to see it and right heart to admire it.

Friday, April 19, 2019

ఎదురుచూపు

అతను వెళ్ళాకనే తాను వస్తానని ఎరుగని సంధ్య
సూర్యుని రాక కోసం ఎదురు చూసి చూసి
గడ్డి పరకల మీద నీటి బిందువులు విడిచి వెళుతుంది
                   
                                                                         --యెండమూరి వీరేంద్రనాధ్


Monday, August 20, 2018

జ్ఞాపకాల సుడిగుండాలు

శిధిలమైన కలల శౌధం వదలనంటె  హృదయం
మార్చలేని ఆ గతం మరువ లేకున్న
జ్ఞాపకాల సుడిగుండాలు ఎదను పట్టి లాగుతుంటే 
వర్షించే నా మనస్సును దాచలేకున్న   
నీతో తిరిగిన ప్రతీ చోటు నను వంటరినంటుంటే
తీరమెరుగని నా పయనం ఎటువైపో మరి
కడవరకు నీ తోడుంట అని చేసిన బాస నను ప్రశ్నిస్తుంటే
మదిలోని ఆ వసంతం కనుమరుగై పోయెనే  

Tuesday, November 18, 2014

మనస్సు ప్రేమిస్తూనే ఉంటుంది

ధరణిని దాట లేనని తెలిసినా కెరటం ఆనందంతో ఎగిసి పడుతుంది
     తననే నమ్మిన నావను గమ్యం చేరుస్తుంది కనుక
చినుకై రాలిపోతానని తెలిసినా మేఘం గర్వంతో గర్జిస్తుంది
     తన చినుకులు పంట చేలకు తెచ్చిన వన్నెని చూస్తుంది కనుక
వాడి రాలిపోతానని తెలిసినా పుష్పం అందంగా విరబూస్తుంది
     తన సొగస్సు తనూలత పెదవులపై దరహాసాన్ని తెస్తుంది కనుక
మరణిస్తానని తెలిసినా జీవి కేరింతలు కొడుతూ జన్మిస్తుంది
     తన చివరి స్వాసదాకా మమతల మధురిమ ఆస్వాదిస్తుంది కనుక 
మోసపోతావని వివరం తెలిపినా మనస్సు ప్రేమిస్తూనే ఉంటుంది
     నిస్వార్ధంగా ప్రేమించే మనస్సు తనని మోసగించదని నమ్ముతుంది కనుక !!!

Monday, December 31, 2012

తరుణి తపము ఫలించునా

యుగ యుగాలకు చెరగని చరిత్ర ఇది
తర తరాలకు మారని తరుణమిది

మనస్సు లేని మనువైనా, మగనికి భార్యలు మెండైనా
రాజ్యాల నడుమ సంధి కుదిర్చే రాయబారైనది రాకుమారి
హేమంతులు, సామంతులు, భూపాలులు, రారాజులు
రక్షకులు ఎందరున్నా రక్షించే వారెవరు ?

రాచరికానికి స్వస్తి చెప్పి రాజ్యాంగం రాశారు  
ఇంటనున్న ఇంతిని, అంగట్లో అమ్మారు
కాటికి కాలు చాపిన కామాంధుని సతియినది
బాల వితంతువై, పతికి పేర్చిన చితితో  కాలే కట్టైనది

కన్యా విక్రయం తగదని చాటారు, సతీసహగమనం ఘోరమని తెలిపారు
సంఘసంస్కర్తలెందరో సాంఘిక దురాచారాలను రూపుమాపారు   
దేశం అభివృధి వైపు పరుగులు తీసింది
మగువ హింసాచరిత్ర కొత్త వన్నెలు దిద్దుకుంది
    
పురిటిలోనే పసి పాపలను చంపటం నేర్చారు
ఆడపిల్లని చదువుకు అనర్హమని తేల్చారు
కన్నె పిల్లల జీవితాలను కాలసర్పమై కాటువేసారు  
వరకట్నం ఆవహించి సతీ దహనం చేసారు

లోకం తెలియని పసిపాపైనా
ఆడేపాడే చిన్నరి బాలికైనా
పదహరణాల పడుచు పిల్లైనా
మెట్టినింట అడుగుపెట్టిన నవవధువైనా

తరం ఏదైనా తరుణి తపము ఫలించునా ???
దశాబ్దాలెన్నైనా  కోమలి కష్టం తీరునా ???
గ్రహాలు మారినా పట్టిన గ్రహణం వీడునా???

Thursday, November 8, 2012

ప్రేమ

మనస్సు భాషా ప్రేమ 
మైమరపు పేరే ప్రేమ
ఎవరెరుగని ఓ మైకమా 

సంతోషాల నెలవె ప్రేమ
సుడిగుండాల కొలువె ప్రేమ
చీకటి వెలుగులకిది సరిగమ

కరునించే వరమె ప్రేమ
శిక్షించే శరమే ప్రేమ
ఊహకందని త్రిశంకుస్వర్గమా 

Monday, June 18, 2012

నలుపు

వధువు బుగ్గన చుక్కై దిష్టి తీస్తుంది నలుపు
మగువ కంటి కాటుకై సొగసు నింపుతుంది నలుపు
కొంటె కృష్ణుని మేనినంటి పూజలందుకుంటుంది నలుపు
రాతిరికి రారాజై ఆకాశానికి చీరకడుతుంది నలుపు
తనూలత తనువుపైన తుమ్మెదరెక్కల్లాంటి కురులై ఊయలూగుతుంది నలుపు
తెల్లని కాగితంపై పేర్చిన అక్షరాలతో అందమైన భావాలల్లుతుంది నలుపు
గగన వీధుల్లోన కారుమబ్బై కమ్మి వర్షపు జల్లు కురిపిస్తుంది నలుపు
కంటి పాపై కమ్మని కలల కబుర్లు వింటుంది నలుపు
అందమైన ఈ నలుపు నా శరీర వర్ణమై అనాకారిలా మిగిలిపోయింది 

Tuesday, June 14, 2011

Nursery Rhymes English Sindu


వేమన శతకం


పెళ్లిపుస్తకం


పెళ్లంటె
పెళ్లంటె పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు
మూడే ముళ్లు, ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్లు

పెళ్లంటె
మమతలు కూర్చి మాలికలల్లిన సమయం
ఆ కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం 

పెళ్లంటె
ధర్మార్ధకామములల లోన ఏనాడు ఒకరితోడునొకరు విడిచిపోరాదని
ఈ బాస చేసి ఇక నిండునూరేళ్లు నీ సతికి నీడవై నిలిచి కాపాడమని

పెళ్లంటె
నేనే నీవుగా పువ్వు తావిగా
సమ్యోగాల సంగీతాలు విరిసే వేళ