Saturday, February 26, 2011

నా కిష్టం

నదీ పాయల హోరు మధ్యన ఇసుక తిన్నెల స్పర్స నా కిష్టం
చల్లని సాయంతాన్ని,తెల్లని వెన్నెలని సన్నజాజి పందిరి కింద కూర్చుని చూడడం నా కిష్టం
అమ్మ మెత్తని ఒడిలో పడుకుని కబుర్లాడడం నా కిష్టం
గున్నమామి కొమ్మమీది కోయిల పాటంటే నా కిష్టం
ముంగురులు నొసటి సిందూరాన్ని ముద్దాడుతుంటే చూడటం నా కిష్టం
కొబ్బారాకుల మధ్యన దోబూచులాడే చంద్రున్ని చూడటం నా కిష్టం
చేను గట్ల మీద తెగిన చెప్పులతో బురదలో నడవటం నా కిష్టం
గుడిలో రాలిన రాధ-మాధవ పూలంటె నా కిష్టం
జామ చెట్టు కొమ్మమీది రామ చిలుక కిలకిలలు నా కిష్టం
కాటుక రేఖులతో కలకల లాడె కనులంటె నా కిష్టం
ఎర్రగ పండిన గోరింట చేయంటె నా కిష్టం
తామరాకు మీది నీటి బొట్టు నా కిష్టం
ఇన్ని ఆనందాల్ని ఆశ్వదింపచేసె మనిషి జన్మంటె నా కెంతో కిష్టం

No comments:

Post a Comment