Wednesday, March 2, 2011

వనకన్య వేకువ

చిట్టి చిట్టి పక్షులెన్నో రాగాలు పాడి
చల్లని హిమ బిందువులు నీ మోమును తాకి
ఉదయించే సూర్యుడు లేలేత కిరణాలు విస్తరించి
ప్రకృతి వడిలో ఆదమరిచి నిదురించే నిన్ను మేల్కొల్పగా....

అందమైన ఆ అవనిని చూసి
అదుపులేని ఆనందం వేసి
నింగిని తాకే చిరుపక్షివి నీవై
ఉల్లాసంగా ఎగిసి పడుతుంటె

స్వర్గమంటి ఆ వనము మధ్యన
చుక్కలనంటు జలపాతాలతో
సరిగమలు మరిపించు కొయిల గానాలతో
జగత్తునే మరచి నీవు విహరిస్తుంటే

నేలనంటు ఆ నింగుకి దిగువ
ముత్యమంటి చిరు తొలకరి నడుమ
కలువలన్నీ నీ కరముల మధ్యన
అందంగా నీవు అగుపడుతుంటావు

అంతటి ప్రకృతి సోయగాన్ని సైతం మైమరపించే నీ అందం వర్ణనాతీతం

No comments:

Post a Comment