Monday, June 18, 2012

నలుపు

వధువు బుగ్గన చుక్కై దిష్టి తీస్తుంది నలుపు
మగువ కంటి కాటుకై సొగసు నింపుతుంది నలుపు
కొంటె కృష్ణుని మేనినంటి పూజలందుకుంటుంది నలుపు
రాతిరికి రారాజై ఆకాశానికి చీరకడుతుంది నలుపు
తనూలత తనువుపైన తుమ్మెదరెక్కల్లాంటి కురులై ఊయలూగుతుంది నలుపు
తెల్లని కాగితంపై పేర్చిన అక్షరాలతో అందమైన భావాలల్లుతుంది నలుపు
గగన వీధుల్లోన కారుమబ్బై కమ్మి వర్షపు జల్లు కురిపిస్తుంది నలుపు
కంటి పాపై కమ్మని కలల కబుర్లు వింటుంది నలుపు
అందమైన ఈ నలుపు నా శరీర వర్ణమై అనాకారిలా మిగిలిపోయింది 

2 comments:

  1. మీ భావసంపద బాగున్నది.
    నా మదిలో మెదిలే ఊహల పోలుచున్నది.

    ReplyDelete